: అవన్నీ పుకార్లంటూ ట్వీట్ చేసిన నాని
టాలీవుడ్ రైజింగ్ స్టార్ నాని తన తదుపరి సినిమాపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. 'నేను లోకల్' సినిమా తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నిర్మాతగా తీయబోయే తొలి టాలీవుడ్ సినిమాలో నాని హీరోగా ఎంపికయ్యాడంటూ ఇటీవల వార్తలొచ్చాయి. వీటిని చూసిన నాని... అవన్నీ నిరాధారమైన వార్తలని, ఒట్టి పుకార్లని కొట్టిపడేశాడు. ప్రస్తుతం తాను 'నేను లోకల్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నానని తెలిపాడు. ఈ సినిమాలో నాని సరసన క్రేజీ హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తోంది.