: అర్ధనగ్నంగా అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టిన బీహార్ ఎమ్మెల్యే
బీహార్ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే చేబట్టిన వినూత్న నిరసన కలకలం రేపింది. తన నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే బినయ్ బిహారీ పాట్నాలోని అసెంబ్లీకి అర్ధనగ్నంగా చేరుకున్నారు. కేవలం బనియన్, షార్ట్ తో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే బీహార్ అసెంబ్లీ ముందు బైఠాయించారు. భారత ప్రభుత్వానికి తన కుర్తాను, బీహార్ అసెంబ్లీకి తన పైజామాను గిఫ్ట్ గా ఇచ్చానని, అందుకే ఇలా వచ్చానని ఆయన చెప్పారు.