: ‘ఆక్రోశ్’తో విపక్షాలు నవ్వుల పాలయ్యాయి: వెంకయ్యనాయుడు
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ‘ఆక్రోశ్’ ర్యాలీని తలపెట్టిన విపక్షాలు నవ్వుల పాలయ్యాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఈరోజు తలపెట్టిన ర్యాలీలు, బంద్ పూర్తిగా విఫలమయ్యాయని, బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు లభిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు.