: హే యామీ... ఎందుకంత కోపం?: రాం గోపాల్ వర్మ
ఈ రోజు నటి యామీ గౌతమ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెపై సెటైరికల్ గా ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'హే యామీ, పుట్టిన రోజు నాడు ఫెయిర్ గా, లవ్లీగా ఉండాల్సిన నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు?' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, తన 'సర్కార్ 3' సినిమాలో అమితాబ్, యామీలు సీరియస్ గా చూస్తున్న ఫొటోలను అప్ లోడ్ చేశాడు. 'వీళ్లిద్దరూ చూపులతోనే చంపేస్తున్నారు' అంటూ మరో ట్వీట్ చేశాడు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించిన యామీ గౌతమ్... ఆ తర్వాత సినీ రంగంలో అడుగు పెట్టింది. తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న 'కాబిల్', వర్మ సినిమా 'సర్కార్ 3'లో నటిస్తోంది.