: పోర్న్ స్టార్ ను సౌదీ రాయబారిగా నియమించాలంటూ పిటిషన్


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆ దేశంలో జరుగుతున్న విచిత్రాలు అన్నీఇన్నీ కావు. తాజాగా ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలని కోరుతూ ఆన్ లైన్ లో పిటిషన్ నమోదైంది. ఈ పిటిషన్ ను ఛేంజ్.ఓఆర్జీ వెబ్ సైట్ లో ఓ వ్యక్తి నమోదు చేశారు. ఆ వ్యక్తి ఈ పిటిషన్ ను సీరియస్ గా పెట్టాడో లేక జోక్ కోసం పెట్టాడో తెలియదు కానీ, ఇది వైరల్ అవుతోంది. అమెరికా బహుళ సంస్కృతికి మియా ఖలీఫా ప్రతీకగా నిలుస్తోందని... జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలందరినీ ఒక్కచోటుకు చేరుస్తోందని పిటిషనర్ తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ కు మద్దతుగా 1200 మంది సంతకం చేశారు. మరో 300 మంది సంతకాలు వస్తే, అధికారికంగా పిటిషన్ ను స్వీకరించేందుకు అర్హత పొందుతుంది.

  • Loading...

More Telugu News