: దేవుళ్ల పేర్లతో రేషన్ కార్డులు.. అర్చకుడికి సమన్లు


దేవుళ్ల పేర్లతో రేషన్ కార్డులు సంపాదించి ప్రతి నెలా సబ్సిడీపై సరుకులు తెచ్చుకుంటున్న ఓ అర్చకుడి విషయం తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్ లోని బరాన్ జిల్లా కేంద్రానికి చెందిన బాబూలాల్ అనే వ్యక్తి కజిఖేర్ ప్రాంతంలోని కృష్ణ భగవానుడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. కృష్ణుడు, గణేశ్.. వంటి దేవుళ్ల పేరుతో రేషన్ కార్డులు సంపాదించాడు. 2005వ సంవత్సరం నుంచి ఈ విధంగా చేస్తూ రేషన్ తీసుకువెళుతున్నాడు. అయితే, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడంతో బాబూలాల్ విషయం బయటపడింది. గతవారం యథావిధిగా రేషన్ తీసుకునేందుకు ఆయన దుకాణానికి వెళ్లాడు. రేషన్ కార్డులపై పేర్లను చూసిన అధికారులు, వాళ్లను పిలిపించమని కోరడంతో బాబూలాల్ బిక్కమొహం వేశాడు. ఆ పేర్లు అన్నీ దేవుడివనీ, తాను తప్పు చేశానని అర్చకుడు అంగీకరించాడు. దీంతో, సంబంధిత శాఖాధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. తదుపరి చర్యల విషయమై పౌరసరఫరాల శాఖాధికారులు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News