: కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఇంట్లో పెళ్లిపై కేజ్రీవాల్ ట్వీట్..దీటుగా జవాబిచ్చిన మంత్రి


పెద్దనోట్ల రద్దు నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తాజాగా, కేంద్రమంత్రి మహేశ్ శర్మను టార్గెట్ చేశారు. మహేశ్ శర్మ ఇంట్లో పెళ్లి ఖర్చుపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నలు సంధించారు. ‘మహేశ్ శర్మ తన కూతురు పెళ్లిని రూ.2.5 లక్షలతోనే చేస్తున్నారా?, అన్ని చెల్లింపులు చెక్కులతోనే చేస్తున్నారా?, పాతనోట్లను ఆయన ఎలా మర్చారో చెప్పాలి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే, కేజ్రీ ట్వీట్ కు వెంటనే ప్రతిస్పందించిన మహేశ్ శర్మ, పెళ్లి చేస్తున్నది తన కుమార్తెకు కాదని, కుమారుడుకి అని, ఈ విషయాన్ని కేజ్రీవాల్ ముందుగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పెళ్లి వేడుకకు సంబంధించిన చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారానే చేస్తున్నట్లు మహేశ్ శర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News