: 2న ఢిల్లీలో ‘టాటూ’ ఫెస్టివల్


అంతర్జాతీయ ‘టాటూ’ (పచ్చబొట్టు) లను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో వచ్చే నెల 2వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ‘టాటూ’ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. జర్మనీ, ఇంగ్లాండ్, రష్యా, స్పెయిన్, నెదర్ ల్యాండ్ దేశాలకు చెందిన ప్రముఖ టాటూ కళాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా టాటూల గురించి పలు విషయాలను వారు వివరిస్తారని, ఈ కార్యక్రమాన్ని టీఎల్సీ ఛానెల్ ప్రసారం చేయనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News