: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఉంటుంది: బాలకృష్ణ


గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అని, యావత్తు దేశానికి చెందిన చక్రవర్తి కథ ఇది అని అన్నారు. మొరాకో, జార్జియా దేశాలతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని అన్నారు. ఈ చిత్రం రీ-రికార్డింగ్, డబ్బింగ్, గ్రాఫిక్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు బాలకృష్ణ చెప్పారు.

  • Loading...

More Telugu News