: పవన్ పై సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ


సోషల్ మీడియాలో తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, సెటైర్ వేయడం ద్వారా ఆయన అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పించాడు. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రో మరణించిన తరువాత పవన్ స్పందిస్తూ, "నేను చాలా గౌరవించే వ్యక్తి 'చే'తో కలసి నడిచిన ఫిడెల్ ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన వర్మ స్పందిస్తూ, "పవన్ కల్యాణ్ కాంప్లిమెంట్ ను చూసిన తరువాత 'చే' ఆత్మ శాంతంగా ఉండదు సరికదా... ఆనందంతో గంతులేస్తుంది. నేనైతే మాత్రం చెగువేరా కన్నా పవన్ నే ఇష్టపడతాను" అన్నాడు. వర్మ వేసిన ఈ సెటైర్ ను సీరియస్ గా తీసుకున్న పవన్ అభిమానులు ఇప్పుడు ఆయనపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

  • Loading...

More Telugu News