: విపక్షాల హర్తాళ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అరెస్టైన నేతల వివరాలు


పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేక దిక్కుతోచని పరిస్థితిలో కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విపక్షాలు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవర్ని అరెస్ట్ చేశారో చూద్దాం. చిత్తూరులో భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా, మర్రి రాజశేఖర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి కర్నూలులో హఫీజ్ ఖాన్ విజయవాడలో సామినేని ఉదయభాను విశాఖపట్నంలో ధనిశెట్టి బాబూరావు తూర్పుగోదావరిలో తోట సుబ్బరాయుడు, ఆవాల లక్ష్మీనారాయణ శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వి కళావతి హైదరాబాదులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు కరీంనగర్ లో ముకుందరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News