: హిమాయత్ నగర్ పోస్టాఫీసు సిబ్బందిపై సీబీఐ కేసులు నమోదు
రద్దయిన నోట్లను పలువురికి పెద్దమొత్తంలో మారుస్తూ ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణల నేపథ్యంలో బ్యాంకులు, పోస్టు ఆఫీసులపై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ పోస్టాఫీసులో జరిగిన అవకతవకలు బయటపడటంతో పోస్టాఫీసు సిబ్బందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నగదు మార్పిడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా హిమాయత్ నగర్ పోస్టాఫీసు సిబ్బంది వ్యవహరించారని, రూ.36 లక్షల మార్పిడి చేశారనే ఆరోపణలపై అధికారులు కేసులు నమోదు చేశారు. సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, పోస్టుమాస్టర్ రేవతి, సీనియర్ అసిస్టెంట్ రవితేజపై ఈ మేరకు అభియోగాలు నమోదు చేశారు.