: ఎన్టీఆర్ కోరికను నెరవేరుస్తున్న బాలయ్య: క్రిష్


దాదాపు అన్ని పౌరాణిక పాత్రల్లో నటించిన నందమూరి తారకరామారావుకు గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రలో నటించాలనేది తీరని కోరికగానే మిగిలిపోయిందని, ఆ కోరికను ఆయన కుమారుడు, నందమూరి బాలకృష్ణ నెరవేర్చారని దర్శకుడు క్రిష్ అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ సన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం, క్రిష్ మాట్లాడుతూ, ఈ పాత్రను బాలకృష్ణ తప్ప, మరొకరు చేయలేరని, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఈ చిత్రం షూటింగ్ కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేశామని, ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయని క్రిష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News