: 16న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుక: దర్శకుడు క్రిష్

డిసెంబర్ 16వ తేదీన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు దర్శకుడు క్రిష్ తెలిపారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర యూనిట్ మహా రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం ట్రయలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని, సంక్రాంతి పండగ నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తామనే నమ్మకం తనకు ఉందని, సర్వదేవతలు, ప్రేక్షకులు తమను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని దర్శకుడు క్రిష్ అన్నారు.