: ఏటీఎంలలో నింపే నగదు చోరీ కేసు: డ్రైవర్ కొట్టేసిన రూ. 1.37 కోట్లలో, రూ. 79 లక్షలతో పట్టుబడ్డ అతని భార్య
బెంగళూరులో రూ. 1.37 కోట్ల కొత్త కరెన్సీతో పారిపోయిన క్యాష్ వ్యాన్ డ్రైవర్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఏటీఎంలలో నగదు నింపే పని చూస్తున్న వారిలో వాహనం డ్రైవర్, దాన్ని తీసుకుని ఈ నెల 23 పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వ్యాన్ డ్రైవర్ భార్య పోలీసులకు పట్టుబడగా, ఆమె నుంచి రూ. 79.80 లక్షలను రికవర్ చేశారు. లాజి క్యాష్ అనే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు, మరో ఇద్దరు ఉద్యోగులు, సెక్యూరిటీతో కలసి ఏటీఎంలలో డబ్బు నింపేందుకు వెళ్లిన వేళ, ఇతర ఉద్యోగులు ఏటీఎంలోకి వెళ్లగా, వాహనాన్ని తీసుకుని నిందితుడు పారిపోయాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి ఆయన భార్యను అరెస్ట్ చేశారు. మిగతా డబ్బును కూడా రికవరీ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.