: మడొన్నాకు తలనొప్పిగా మారిన ఆమె కుమారుడు
ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్, హాలీవుడ్ శృంగార నటి మడొన్నాకు... ఆమె కొడుకు రొక్కో రిట్చీ పెద్ద తలనొప్పిగా మారాడు. తన తల్లికి దూరంగా, తండ్రితో కలిసి ఉంటున్నప్పటికీ... తల్లిపై విమర్శలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. తాజాగా తన తల్లి మడొన్నాను కించపరిచే విధంగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను ఉంచాడు. ఆమె తింటున్న సమయంలో, సగం ఆహార పదార్థం నోటి నుంచి బయటకు వచ్చి, అసహ్యంగా ఉంది ఆ ఫొటో. అంతేకాదు... 'ఆమెతో కలసి ఉండటం లేదు... చాలా సంతోషం' అంటూ ఓ వ్యాఖ్యను కూడా ఫొటోకు జత చేశాడు. ఈ వ్యవహారంపై మడొన్నా అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో, వెంటనే ఫొటోను, కామెంట్ ను తొలగించాడు రిట్చీ. గడచిన వారంలో డ్రగ్స్ తో రిట్చీ పోలీసులకు పట్టుబడటం గమనార్హం.