: రోజుకు రూ. 25 వేల కోట్లు పంపుతున్నాం... వెయ్యి నోట్లు త్వరలో: కేంద్రం


ప్రస్తుతం కరెన్సీ కష్టాలను తీర్చేందుకు రోజుకు రూ. 25 వేల కోట్లను బ్యాంకులకు పంపుతున్నామని కేంద్ర సహాయమంత్రి అర్జున్ మేఘ్ వాల్ వ్యాఖ్యానించారు. ప్రజల వద్ద ఉన్నాయని భావిస్తున్న రూ. 14.5 లక్షల పాత 500, 1000 నోట్లలో రూ. 8 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని, ఇదే సమయంలో ఇప్పటివరకూ రూ. 3.35 లక్షల కోట్లను బ్యాంకులకు ఇచ్చామని ఆయన తెలిపారు. రోజుకు రూ. 25 వేల కోట్లు వ్యవస్థలోకి వస్తున్నందున మరో 45 రోజుల తరువాత పరిస్థితి చక్కబడుతుందని మేఘ్ వాల్ తెలిపారు. మరోవైపు రూ. 2 వేలకు చిల్లర లభించడం కష్టంగా మారినందున ఈలోగానే రూ. 1000 కరెన్సీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జన్ ధన్ ఖాతాల్లో సగటు మొత్తం రూ. 1,750 నుంచి రూ. 2,837కు పెరిగిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News