: తిరుమలలో అన్ని చోట్లా స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తాం: టీటీడీ ఈవో


పెద్దనోట్ల రద్దు అనంతరం కరెన్సీ కష్టాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, తిరుమలకు వెళుతున్న భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తిరుమలలో అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కరెన్సీతో పనిలేకుండా తిరుమలలోని 23 చోట్ల స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో లడ్డూలు తీసుకునే క్రమంలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. నూతన దివ్యదర్శనం క్యూ కాంప్లెక్స్ లో మరిన్ని స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కాగా, దివ్యదర్శనం నూతన కాంప్లెక్స్ లను ఈవో సాంబశివరావు నిన్న పరిశీలించారు.

  • Loading...

More Telugu News