: వైఎస్సార్సీపీ నేత భూమన అరెస్ట్
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని పోలీస్ వాహనంలో తీసుకువెళ్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, బ్యాంకుల్లో, ఏటీఎంలలో ప్రజలకు సరిపడా చిన్ననోట్లు అందుబాటులో ఉంచాలని భూమన డిమాండ్ చేశారు.