: రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నీరు-ప్రగతిపై ఈరోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, వందశాతం విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లే రైతులకు వందశాతం సాగునీరు కూడా అందిస్తామన్నారు. వర్షపాతం లోటు ఉన్నా ముందు జాగ్రత్తలతో వ్యవసాయ అనుబంధ రంగాలలో పురోగతి సాధించామన్నారు. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో వర్షపాతం లోటు అధికంగా ఉందన్నారు. పంట సంజీవని, వనం-మనం, ఎన్టీఆర్ జలసిరిపై మరింత శ్రద్ధ వహించాలని, వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్ కు నీటిని తరలించాలని, చెర్లోపల్లి, అడవిపల్లి, చిత్తూరు, కుప్పం, మడకశిర రైతులకు సాగునీటిని అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.