: నోట్ల రద్దు... జీవితంలో ఒకసారే వస్తుంది: ఉర్జిత్ పటేల్


నోట్ల రద్దు తరువాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారని, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్, రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. నోట్ల రద్దు అంశం ఎవరికైనా జీవితకాలంలో ఒకేసారి వచ్చే అవకాశమని, దీన్ని అమలు చేసే అవకాశం తన హయాంలో దక్కడం, తనకు లభించిన మంచి అవకాశమని అన్నారు. దీన్ని విజయవంతం చేయాలంటే, ఎంతో శ్రమించాల్సి వుందని, దీని వల్ల పౌరులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా చేస్తామని, వారి బాధలను తగ్గించే ప్రయత్నం చేస్తామని అన్నారు. నిన్నటివరకూ మౌనంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొన్న ఆయన, రోజువారీ విధానంలో కొత్త కరెన్సీని ముద్రిస్తున్నామని, త్వరలోనే చాలినంత కరెన్సీ బ్యాంకులకు చేరుతుందని అన్నారు. పూర్తి సామర్థ్యానికి తగ్గ స్థాయిలో కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లు పనిచేస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News