: అమెరికాలో కాల్పులకు తెగబడ్డ దుండగుడు... న్యూఆర్లెన్స్ లో కలకలం
అమెరికాలో ఓ సాయుధుడైన దుండగుడు కాల్పులకు తెగబడటం కలకలం సృష్టించింది. న్యూ ఆర్లెన్స్ లోని చారిత్రక ఫ్రెంచి క్వార్టర్స్ లో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కార్నర్ ఆఫ్ బొర్బన్ అండ్ ఐబర్ విల్లే వీధిలో తుపాకితో వచ్చిన ఓ సాయుధుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో, తుపాకి తూటాలు తగిలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన తరువాత ఆయుధాలు ధరించి తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.