: రాజ్యాంగ సవరణ చేసైనా సరే, వర్గీకరణ చేయాల్సిందే: మంద కృష్ణ మాదిగ డిమాండ్
‘ఎస్సీ వర్గీకరణ కోసం ఇరవై మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము, రాజ్యాంగ సవరణ చేసి అయినా సరే ఎస్సీ వర్గీకరణ చేయాలి’ అంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల ‘ధర్మయుద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ, మాదిగలది యాభై సంవత్సరాల ఆవేదన అని, ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుందని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, జానారెడ్డి, టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, విమలక్క తదితరులు పాల్గొన్నారు.