: రేపిస్టులకు అదే సరైన శిక్ష!: నటి మీరా జాస్మిన్


మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి క్యాస్ట్రేషన్ (నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని ప్రముఖ నటి మీరా జాస్మిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని ఆమె అభిప్రాయపడింది. ఇటీవల కేరళలోని పెరుంబవూర్ లో దళిత మహిళను అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి, నటుడు అనూప్ తో కలిసి మీరా జాస్మిన్ మీడియాతో మాట్లాడుతూ, మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్న వారికి క్యాస్ట్రేషన్ వంటి శిక్షలు విధిస్తే కనుక, జీవితంలో మహిళల జోలికి వెళ్లరని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News