: పెద్దనోట్ల రద్దుపై మౌనం వీడిన ఉర్జిత్ పటేల్


పెద్దనోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రోజు వారీగా పరిశీలిస్తున్నామని, బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. నిజాయతీపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, పెద్దనోట్ల రద్దు నాటి నుంచి ఈ అంశంపై ఉర్జిత్ పటేల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇవ్వాలంటూ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News