: కారు బీభత్సం.. కరీంనగర్ లో నలుగురికి గాయాలు


కరీంనగర్ లో ఒక యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ‘ఇన్నోవా’ నడిపిన ఆ యువకుడు పలువురిని గాయాలపాలు చేశాడు. అదుపుతప్పిన ఈ వాహనం కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా నుంచి ఆర్ అండ్ బీ అతిథి గృహం వరకు చాలా వేగంగా వెళ్తూ నలుగురిని ఢీకొట్టింది. దీంతో, భయపడిపోయిన పాదచారులు పరుగులు తీశారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News