: ఆపకుండా వెళ్తున్న వాహనంపై పోలీస్ కాల్పులు.. మహిళ మృతి
ఆపకుండా వెళ్తున్న వాహనంపై పోలీస్ కాల్పులు జరిపిన సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. పాటియాల సమీపంలోని నభా జైలుపై దుండగులు దాడి చేసి ‘ఖలిస్థాన్’ ఉగ్రవాదులను విడిపించుకుపోయిన ఘటన నేపథ్యంలో పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సమన వద్ద ఒక కారును ఆపేందుకు పోలీసులు యత్నించారు. అయితే, ఆపకుండా వెళ్లిపోతుండటంతో ఆ వాహనంపై పోలీసులు కాల్పులు జరపగా, అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది.