: హైదరాబాద్ ఆర్బీఐ ఎదురుగా ఉన్న పాన్ షాపుల్లో నల్లధనం మార్పిడి!
హైదరాబాద్ లోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పాన్ షాపుల్లో నల్లధనం మార్పిడి యథేచ్ఛగా సాగుతున్నట్లు ఒక న్యూస్ ఛానెల్ కథనం. నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు 30 శాతం కమీషన్ తీసుకుంటున్న మాఫియా ఈ దందా నిర్వహిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొంది. 5 శాతం తమకు, 25 శాతం ఆర్బీఐ అధికారులకు ఇస్తున్నామని మాఫియా ముఠాలోని సభ్యులు చెప్పినట్లుగా ఈ కథనం ద్వారా తెలుస్తోంది.