: పోలీసుల్లా జైలుకు వచ్చారు... తీవ్రవాదులను తప్పించారు!


ఈ తెల్లవారుఝామున పంజాబ్ పరిధిలోని పాటియాలాలో ఉన్న నబా జైలుపై ఆయుధాలతో దాడి చేసి ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మిందర్‌ సింగ్‌ మింటూ సహా ఐదుగురు తీవ్రవాదులను తప్పించిన దుండగులు పోలీసుల వేషంలో వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసు దుస్తులతో జైలు గేటు వద్దకు వచ్చిన వీరిని ఎలాంటి అనుమానం లేకుండానే లోనికి అనుమతించగా, ఆపై తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాదాపు 100 రౌండ్ల పాటు కాల్పులు జరుపుతూ, ఐదుగురినీ వీరు విడిపించుకుని తీసుకెళ్లారు. పారిపోయిన వారి కోసం పాటియాలా చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లో గాలింపును తీవ్రం చేశామని, సాధ్యమైనంత త్వరగా వీరిని పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News