: ఇంగ్లండ్ సాధించిన 283 పరుగుల్లోనూ ఓ రికార్డు!
మొహాలీలో భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్ జట్టు 15 సంవత్సరాల నాటి రికార్డును సమం చేసింది. ఇండియాలో పర్యటించే విదేశీ జట్టు, తొలి నాలుగు వికెట్లనూ 100 పరుగుల లోపు కోల్పోయి, ఆపై 280 పరుగులు చేయడం 2001 తరువాత ఇది రెండో సారి మాత్రమే. 2001లో ఇండియాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు 98 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, ఆపై 349 పరుగులు సాధించగా, ఇంగ్లండ్ ఆ రికార్డుకు దగ్గరైంది. తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులకు కీలకమైన నాలుగు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కూడా నిలదొక్కుకుంది.