: ఫిడేల్ క్యాస్ట్రో మృతిని సెలబ్రేట్ చేసుకుంటున్న మియామీ... సందడితో హోరెత్తుతున్న వీధులు


'ఓ దుర్మార్గుడు పోయాడు', 'క్యూబాకు స్వాతంత్ర్యం వచ్చినట్టే ' అంటూ మియామీ వీధులు మారుమోగాయి. క్యూబా విప్లవ నేత క్యాస్ట్రో మృతి పట్ల, గతంలో క్యూబా నుంచి వలస వచ్చి అమెరికన్లుగా మారిపోయి నివసిస్తున్న వందలాది మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హవానా కమ్యూనిస్టుల పాలన సమయంలో వలస వచ్చి స్థిరపడిన వీరంతా, కార్లలో వీధుల్లోకి వచ్చి, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యాలు చేస్తూ, నినాదాలు చేస్తూ, క్యూబా జెండాలను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో క్యూబన్ - అమెరికన్లు అత్యధికంగా ఉండే ప్రాంతం మియామీ కాగా, క్యాస్ట్రో మృతి పట్ల ఇక్కడి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పలువురు యువతీ యువకులు సామాజిక మాధ్యమాల్లో క్యాస్ట్రో మృతి తమకు ఆనందకరమని పోస్టులు పెడుతున్నారు. కాగా, శనివారం అర్ధరాత్రి తన సోదరుడు మరణించినట్టు రౌల్ క్యాస్ట్రో ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News