: నపుంసకులను 'థర్డ్ జండర్'గా పరిగణిస్తున్న రైల్వేస్, ఐఆర్సీటీసీ
ఇకపై భారత రైల్వేలు, ఐఆర్సీటీసీ వెబ్ సైట్ తదితరాల్లో స్త్రీ, పురుషులతో పాటు మూడో ఆప్షన్ గా లింగమార్పిడి వ్యక్తులు, నపుంసకులని తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ దరఖాస్తుల్లో మేల్, ఫిమేల్ పక్కన మరో బాక్స్ కూడా ఉంచారు. ఓ న్యాయవాది వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు. ఆపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు, రైల్వే శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. "హిజ్రాలు, నపుంసకులు, లింగమార్పిడి చేయించుకున్న వారిని 'థర్డ్ జండర్'గా పరిగణిస్తూ, వారి హక్కుల రక్షణకై రాజ్యాంగంలోని 3వ అధికరణంలో తెలిపిన ప్రకారం, ఈ సదుపాయాన్ని కల్పించాం" అని రైల్వే శాఖ ఓ సర్క్యులర్ లో తెలిపింది. మేల్, ఫిమేల్ పక్కన 'థర్డ్ జండర్ / ట్రాన్స్ జెండర్' ఆప్షన్ ఉంచినట్టు తెలిపారు. వీరు తమ టికెట్లపై పూర్తి చార్జీని చెల్లించాల్సి వుంటుందని తెలిపారు.