: రాజకీయ టెన్షన్... విస్కాన్సిన్ రీకౌంటింగ్ లో పాల్గొననున్న హిల్లరీ క్లింటన్
అమెరికాలోని స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ, అతికొద్ది ఓట్ల మెజారిటీతో ట్రంప్ ను గెలిపించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రక్రియలో హిల్లరీ క్లింటన్ కూడా పాల్గొనాలని నిర్ణయించారు. తాము విస్కాన్సిన్ రీకౌంటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించినట్టు హిల్లరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 30 లక్షల ఓట్లను ఒక్కోటిగా పరిశీలించనుండగా, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ మేరకు రీకౌంటింగ్ కు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, తొలుత తాము రీకౌంటింగ్ ను కోరుకోలేదని క్లింటన్ ప్రచార బృందం ప్రతినిధి మార్క్ ఎలియాస్ వెల్లడించారు. ఓటింగ్ వ్యవస్థను హ్యాక్ చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అయితే, ఇప్పుడు రీకౌంటింగ్ జరుగుతోంది కాబట్టి తాము ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు.