: దొంగనోట్లు పెరుగుతున్న వేళ... కొత్త నోట్లలో అందరూ సులువుగా గుర్తించే సెక్యూరిటీ ఫీచర్లివి!


కొత్త కరెన్సీ వచ్చి పట్టుమని మూడు వారాలు కూడా కాలేదు, అప్పుడే రూ. 2000, రూ. 500 నోట్ల నకిలీ కరెన్సీ మార్కెట్లోకి వచ్చింది. పలు ప్రాంతాల్లో ఎన్నో ముఠాలు దొంగనోట్లను ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ముఠాలు పోలీసులకు చిక్కాయి కూడా. ఇక కొత్త నోట్లలో అసలు వాటికి, నకిలీలకు తేడాను చాలా స్పష్టంగా, సులువుగా తెలుసుకోవచ్చని అంటున్నారు పోలీసు అధికారులు. అసలు కరెన్సీని వేలితో కొడితే, శబ్దం ఎక్కువ వస్తుందని, నకిలీ కరెన్సీలో శబ్దం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త నోట్లలో కుడివైపు కనిపించే గీతలు ఉబ్బెత్తుగా ఉంటాయని, నకిలీ కరెన్సీలో అలా ఉండవని తెలిపారు. ఇక కరెన్సీ మధ్యలో ఆర్బీఐ లైన్‌ మెరుస్తూ ఉంటుందని, అసలు నోటుపైన తెల్లని కాగితం పెట్టి పెన్సిల్‌ తీసుకుని గిస్తే, ఆ కాగితంపై ఆర్బీఐ, ఆ నోటుకు సంబంధించిన వివరాలు ప్రింట్ అవుతాయని, నకిలీ కరెన్సీలో అలా జరగదని పోలీసులు చెబుతున్నారు. అసలు నోటులో అశోక చక్రం ఉబ్బెత్తుగా ఉంటుందని, నకిలీలో ఎత్తుగా అనిపించదని చెబుతూ, వీటిని చాలా సులువుగా పరిశీలించి, అసలు, నకిలీలను గుర్తించవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News