: రేపటి బంద్‌కు మద్దతు ప్రకటించిన వైసీపీ.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు రేపు(28న) తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ మేరకు ఆ పార్టీ కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తెలిపారు. బంద్‌లో కడప జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని, అయితే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లు రద్దు చేసి 18 రోజులు అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూనే బంద్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన దేశవ్యాప్త బంద్‌కు వైసీపీ బేషరతు మద్దతు ప్రకటించిందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.