: ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది.. ఆయనకు సెల్యూట్ చేస్తా: శత్రుఘ్న సిన్హా


ప్రధాని నరేంద్ర మోదీకి సెల్యూట్ చేస్తానని ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయం పెద్దనోట్ల రద్దు అని అన్నారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రధాని పారదర్శకంగా ఉన్నప్పటికీ ఆయన బృందం మాత్రం సరిగ్గా పని చేయడం లేదని అన్నారు. గుర్తింపు కోసమే తనపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రెండు రోజుల క్రితం బీజేపీ నిర్వహించిన సర్వే ఫలితాలు బూటకమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయాలు నచ్చకపోతే పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాలని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సిన్హాకు సూచించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News