: యూపీఏ కంటే మేమే గ్రేటు: అమిత్ షా


యూపీఏ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వమే గ్రేటని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో పాలించిన యూపీఏ ప్రభుత్వం దేశాన్ని పట్టించుకోలేదని అన్నారు. మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకప్యాకేజీ ఇచ్చిన ఘనత బీజేపీదేనని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే 16,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మోదీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే కృష్ణా, గోదావరి నదుల మధ్య సారవంతమైన నేల ఉందని అన్నారు. గతంలో దేశంపై ఉగ్రవాదులు దాడులు చేస్తే మౌనంగా ఉండేవారని, ఇప్పుడు అలా కాదని, ఆ దేశాల్లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామని చెప్పారు. మోదీ ఏం చేసినా విపక్షాలు విమర్శిస్తాయని ఆయన చెప్పారు. మోదీ సోమవారాన్ని సోమవారం అంటే, కాదని విపక్షాలు అంటాయని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News