: భారత్ యుద్ధానికి దిగితే...చైనా మద్దతు మాకే: పాక్ రక్షణ మంత్రి
భారత్ తమతో యుద్ధానికి దిగితే చిరకాల మిత్రదేశం చైనా తమకు పూర్తి మద్దతునిస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ తో యుద్ధం జరిగితే పాకిస్థాన్ కు సంబంధించిన అన్ని రక్షణ సంబంధాల్లోను చైనా సహకారం అందిస్తుందని అన్నారు. ఎల్ఓసీ వెంబడి జరిగిన దాడుల్లో తమ దేశానికి చెందిన పది మంది పౌరులు మరణించారని తెలిపారు. 21 మంది గాయాలపాలయ్యారని అన్నారు. అయితే దీటుగా స్పందించిన పాక్ ఆర్మీ భారత్ దాడులను తిప్పికొట్టి ఇండియన్ ఆర్మీకి చెందిన ముగ్గురు సైనికులను బలిగొందని ఆయన పేర్కొన్నారు.