: అమరుడైన జవాను కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన హీరో అక్షయ్ కుమార్
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. అంతేకాదు, భారత సైన్యం అంటే అతనికి అంతులేని గౌరవం. విధినిర్వహణలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడంలో అక్షయ్ ముందుంటాడు. తాజాగా అసోంలోని తన్ సుకియా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిలో ఒకడైన ఎన్ కే సర్పత్ కుటుంబానికి తన వంతుగా రూ. 9 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు అక్షయ్. ఎన్ కౌంటర్ గురించి తెలిసిన తర్వాత.... సర్పత్ కుటుంబాన్ని కలిసి అతని మృతికి నివాళి అర్పించాడు. ఆ తర్వాత రూ. 9 లక్షలను కుటుంబ సభ్యులకు అందజేశాడు. ఎవరికైనా తన సహాయం అవసరమైతే, తనకు తెలియజేయాలని గతంలోనే అక్షయ్ ప్రకటించాడు.