: 50 వికెట్లు తీసిన కీపర్ల జాబితాలో పార్థివ్ పటేల్!


టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత జట్టులో స్థానం సంపాదించిన పార్థివ్ పటేల్ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ (27)ను స్టంప్ అవుట్ చేయడం ద్వారా 50 వికెట్లు తీసిన కీపర్ గా నిలిచాడు. గతంలో 49 (41 క్యాచ్ లు, 8 స్టంప్ లు) మందిని పెవిలియన్ కు పంపిన పార్థివ్ నేడు, అలిస్టర్ ను out చేసి, 50 మందిని అవుట్ చేసిన కీపర్ గా నిలిచాడు. 50 మందికి పైగా అవుట్ చేసిన భారత జట్టు వికెట్ కీపర్లలో 8వ వాడిగా నిలిచాడు. అలాగే 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడే అవకాశం పొందిన ఆటగాడిగా కూడా పార్థివ్ నిలిచాడు. చిన్నవయసులోనే టీమిండియాలో స్థానం సంపాదించిన పార్థివ్ పేలవ ప్రదర్శనతో పెవిలియన్ కు పరిమితమయ్యాడు. దీంతో పట్టుదలతో ప్రయత్నించిన పార్థివ్ 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల్లో స్థానం సంపాదించలేకపోయిన ఆటగాళ్లు ఇంతవరకు రిటైర్ అవుతూ వస్తున్నారు. కానీ పార్థివ్ మాత్రం 83 టెస్టుల తరువాత జట్టులో స్థానం సంపాదించుకోవడం విశేషం. గతంలో ఏ క్రికెటరూ ఇంత కాలం విరామం తరువాత తిరిగి జట్టులో ప్రవేశించలేకపోవడంతో పార్థివ్ అరుదైన ఘనతను సాధించాడు.

  • Loading...

More Telugu News