: మరోసారి బెయిర్ స్టో ఒంటరి పోరాటం...ఇంగ్లండ్ 221/6
మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తడబడింది. హమీద్ (9), రూట్ (15), కుక్ (27), అలీ (16), స్టోక్స్ (29) ఆకట్టుకోలేకపోగా, బెయిర్ స్టో తో కలిసి జోస్ బట్లర్ (43) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నిలదొక్కుకున్నారనుకుంటున్న దశలో బట్లర్ అవుటయ్యాడు. అనంతరం వోక్స్ (9)తో కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను బెయిర్ స్టో (72) నడిపిస్తున్నాడు. రెండో టెస్టులో కూడా బెయిర్ స్టో ఆకట్టుకునే ఆటతీరుతో నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 76 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్, షమి చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.