: 'అవతార్ 2' విడుదల తేదీని ప్రకటించిన నిర్మాణ సంస్థ సెంచరీ ఫాక్స్


2009లో విడుదలైన 'అవతార్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే అని హాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ 'అవతార్ 2' విడుదల తేదీని... చిత్ర నిర్మాణ సంస్థ ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వెల్లడించింది. 2018 డిసెంబర్ 21వ తేదీన రెండో భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే... అవతార్ 3, 4, 5 భాగాలను కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారు నిర్మాతలు. 2020, 2022, 2023 సంవత్సరాల్లో వీటిని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News