: పాతబస్తీలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రహ్లాద్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ, హైదరాబాద్ రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో ప్రజల ముఖాలు సంతోషంగా కనిపిస్తున్నాయని... నోట్ల సమస్యలు వారిలో కనిపించడం లేదని చెప్పారు. నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలస్ లను కూడా ఆయన సందర్శించబోతున్నారు.