: మరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్... బెయిర్ స్టో హాఫ్ సెంచరీ


మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో స్టోక్స్ (29) స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో, స్టోక్స్, బెయిర్ స్టోల 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో బట్లర్ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు బెయిర్ స్టో మరో హాఫ్ సెంచరీని సాధించాడు. 102 బంతులను ఎదుర్కొన్న బెయిర్ స్టో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు. భారత బౌలర్లలో షమీ, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, అశ్విన్, జడేజాలు చెరో వికెట్ పడగొట్టారు.

  • Loading...

More Telugu News