: 28న రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన, ఆర్బీఐ ఎదుట మానవహారం: ఉత్తమ్ కుమార్


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మండిప‌డుతున్న ప్ర‌తిప‌క్ష పార్టీలు ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా దేశ వ్యాప్త ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. వ‌చ్చే సోమ‌వారం (ఈ నెల 28వ తేదీన) నిర్వ‌హించ‌నున్న‌ ఆక్రోష్‌ దివస్‌పై తాము తెలంగాణ‌లో చేప‌ట్ట‌నున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో తాము నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొని, సామాన్యులు ప‌డుతున్న ఇబ్బందులను కేంద్ర సర్కారుకి తెలుపుతామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌ సెక్ర‌టేరియ‌ట్ రోడ్డులోని ఆర్బీఐ శాఖ‌ కార్యాలయం ఎదుట ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా తాము మానవహారం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News