: షాకింగ్... యువరాజ్ వివాహానికి ఆయన తండ్రి హాజరు కావడం లేదు


ఈ నెల 30న టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం జరుగుతోంది. తన ప్రియురాలు హాజెల్ ను యువీ పెళ్లాడనున్నాడు. 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరగబోతోంది. అయితే, ఈ పెళ్లికి తాను హాజరు కావడం లేదని యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తెలిపారు. తాను దేవుడిని నమ్ముతానుకానీ, మత గురువులను కాదని... అందుకే పెళ్లికి హాజరుకావడం లేదని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని యువీ తల్లి షబ్నంకు ఇంతకు ముందే చెప్పానని తెలిపారు. అయితే, యువీ కోరిక మేరకు ఈ నెల 29న హోటల్ లలిత్ లో జరిగే మెహిందీ ఫంక్షన్ కు మాత్రం హాజరవుతానని చెప్పారు. యువరాజ్ తల్లదండ్రులు చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. దాంతో తల్లి వద్దే యువీ పెరిగాడు. తనకు కాబోయే కోడలు హాజెల్ పై యోగ్ రాజ్ ప్రశంసలు జల్లు కురిపించారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా... సంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుందని కొనియాడారు. హాజెల్ రాకతో తమ కుటుంబంలో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు విలాసవంతమైన వివాహాలకు అందరూ ముగింపు పలకాలని యోగ్ రాజ్ కోరారు. పెళ్లిళ్ల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం మంచిది కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News