: రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ పిటిషన్!


సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మధురై జిల్లా మేలూరు సమీపంలోని మలంపట్టికి చెందిన కదిరేశన్, మీనాళ్ దంపతులు ఈ పిటిషన్ ను వేశారు. ధనుష్ తమ కుమారుడే అని... అతని ఒరిజినల్ పేరు కలైసెల్వన్ అని పిిటిషన్ లో వారు పేర్కొన్నారు. చిన్నప్పుడు సరిగా చదువుకోవడం లేదని మందలించడంతో... సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి డీఎన్ఏ టెస్టులకు కూడా రెడీనే అని వారు చెప్పారు. తాము చెబుతున్నది నిజం అని నిరూపించడానికి తమ వద్ద పలు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 12న కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ధనుష్ కు సమన్లు జారీ చేసింది. మరోవైపు, ధనుష్ పెళ్లి సమయంలో కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. ధనుష్ తన కుమారుడు అంటూ ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. దీంతో, ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News