: పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది: మనోహర్ పారికర్
సరిహద్దుల్లో పాక్ చేస్తున్న పిరికిపంద దాడులను మన సైన్యం దీటుగా తిప్పి కొడుతుండటంతో... ఆ దేశం కాళ్ల బేరానికి వచ్చిందని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ నేపథ్యంలో, సరిహద్దుల్లో దాడులను ఆపాలని భారత్ ను కోరిందని చెప్పారు. గోవాలో ఓ సభలో ప్రసంగిస్తూ పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానపరంగా అత్యంత బలమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మన సైన్యం బలమైందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని... కానీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా అత్యంత కీలకమని తెలిపారు. పాక్ పై దాడులను ఆపడానికి భారత్ కు ఎలాంటి అభ్యంతరం లేదని... కాకపోతే, వారు కూడా ఆపాలని... అప్పుడే సరిహద్దులు ప్రశాంతంగా ఉంటాయని చెప్పారు.