: అదుపుతప్పి బోల్తా పడిన స్కూల్ బస్సు... 20 మంది చిన్నారులకు తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులను ఇంటి నుంచి పాఠశాలకు తీసుకెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో బస్సులోని 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న స్థానికులు, పోలీసులు విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలను చేపడుతున్నారు.