: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
భారత్, ఇంగ్లండ్ ల మధ్య మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కెప్టెన్ కుక్ దూకుడుగా ఆడుతూ 23 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో హమీద్ 5 పరుగులతో ఆడుతున్నాడు. ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. భారత్ తుది జట్టులో మురళీ విజయ్, పార్థివ్ పటేల్, పుజారా, కోహ్లీ, రహానే, నాయర్, అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ లు ఉన్నారు.